|
|
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 02:33 PM
నిర్మల్ ను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మారే దిశగా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందాలు మరింత ప్రభావవంతంగా ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన, బాల్య వివాహాలు, బాల కార్మిక నిర్మూలన, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ చట్టాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు. ఈ మేరకు ప్రచార రథాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు