|
|
by Suryaa Desk | Fri, May 16, 2025, 12:43 PM
గ్రామ పంచాయతీ సిబ్బంది మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఆర్‌డీఓ వై. శేఖర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం కట్టంగూర్ మండలంలోని పలు గ్రామాల్లో నర్సరీలను, శాలిగౌరారం మండలం పెర్కకొండారంలోని నర్సరీని, అలాగే రైతులు సాగు చేస్తున్న మునగ తోటను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నర్సరీల్లో మొక్కల పెంపకం సక్రమంగా లేనందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. అలాగే, ఉపాధి కూలీలకు రోజువారీగా కనీసం రూ.307 కూలి గిట్టుబాటు అయ్యేలా చూడాలని ఏపీఓ, ఉపాధి సిబ్బందికి సూచించారు. మొక్కల పెంపకంలో నాణ్యత, శ్రద్ధ అవసరమని డీఆర్‌డీఓ ఉద్ఘాటించారు.