|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 01:58 PM
హరియాణాలో దారుణం చోటుచేసుకుంది. హరియాణా సంగీత పరిశ్రమలో పనిచేస్తున్న మోడల్ శీతల్ అనే యువతిని గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి హత్య చేసి సోనిపట్ జిల్లా ఖండా గ్రామం వద్ద కాలువలో పడేశారు. కొన్ని రోజుల క్రితం ఆమెపై మిస్సింగ్ కేసు నమోదవగా, విచారణలో భాగంగా పోలీసులు ఆమె మృతదేహాన్ని గుర్తించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే నిందితులు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Latest News