|
|
by Suryaa Desk | Wed, May 14, 2025, 01:55 PM
‘ది రాయల్స్’ వెబ్ సిరీస్‌లో తనకన్నా ఆరేళ్లు చిన్నవయసున్న ఇషాన్ ఖట్టర్‌తో రొమాన్స్ చేసినందుకు హీరోయిన్ భూమి పెడ్నేకర్ సోషల్ మీడియాలో ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నారు. దీనిపై స్పందించిన భూమి.. వయస్సు ఆధారంగా పాత్రలను నిర్ణయించరాదన్నారు. నటనలో కంఫర్ట్‌దే ముఖ్యం అని, తమిద్దరం ఒకరినొకరు అర్ధం చేసుకున్నాకే ఇంటిమేట్ సీన్స్ చేశామని వివరించారు. పాత్రకు న్యాయం చేయడానికే ఇలా చేశామని స్పష్టం చేశారు.బాలీవుడ్ లో రొమాంటిక్ సీన్స్ లేకుండా.. ఈ మధ్య సినిమాలు రావడం లేదు.. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తనకన్నా దాదాపు ఆరేళ్ళ చిన్నవాడితో రొమాంటిక్ సీన్స్ లో నటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
Latest News