|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 12:25 PM
TG: SLBC పనుల విషయంలో అధికారులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు త్వరగా పూర్తి చేయడానికి ఒప్పందాలు చేసుకోవడంలో ఎందుకు వెనకపడుతున్నారని ప్రశ్నించారు. నిధుల చెల్లింపునకు ఎస్క్రో ఖాతా తెరవాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నప్పటికీ అవసరమైన సంతకాల విషయంలో సంస్థ తమ ప్రతినిధుల పేర్లను ఇవ్వడం లేదని అధికారులు మంత్రికి తెలిపారు. దీనిపై మంత్రి అసహనం వ్యక్తం చేస్తూ.. 'మీకు భయం అయితే సంతకాలు నేను చేస్తా' అని అధికారులను ఉద్దేశించి అన్నట్లు సమాచారం.