|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 02:56 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి. మర్ఫీ ఢిల్లీలో భేటీ అయ్యారు. విద్య, గ్రీన్ ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్, మౌలిక వసతులు (మెట్రో, పట్టణ రవాణా), మూసీ రివర్ ఫ్రంట్ వంటి అంశాలపై వారు చర్చించారు. తెలంగాణ విజన్ 2047 లక్ష్యాలను సాధించడానికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని సీఎం వివరించారు. ఈ భేటీలో న్యూజెర్సీ గవర్నర్ సతీమణితో పాటు ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.