|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 03:04 PM
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని మోసం చేసిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. శుక్రవారం మావల దుబ్బగూడలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. నిరుపేదలకు ఇళ్లు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని తెలిపారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు.