|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 03:35 PM
వనపర్తి జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తింది. ప్రాజెక్టు అధికారి వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం, గురువారం ఉదయం 15 గేట్లను ఎత్తి, సుమారు 1,21,058 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నెల రోజులు గడిచినా కృష్ణా నదిలో వరద ప్రభావం తగ్గకపోవడంతో, తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.