|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 03:34 PM
టెక్నాలజీ దిగ్గజం మెటా క్రీడాకారులు, అవుట్‌డోర్ యాక్టివిటీస్ ఇష్టపడే వారిని లక్ష్యంగా చేసుకుని సరికొత్త స్మార్ట్ గ్లాసెస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘ఓక్లే మెటా వాన్‌గార్డ్’ పేరుతో విడుదల చేసిన ఈ గ్లాసెస్‌ను తమ వార్షిక 'మెటా కనెక్ట్ 2025' ఈవెంట్‌లో పరిచయం చేసింది. మూడు నెలల క్రితం విడుదలైన ఓక్లే మెటా హెచ్‌ఎస్‌టీఎన్ మోడల్‌కు కొనసాగింపుగా, మరింత అధునాతన ఫీచర్లతో వీటిని రూపొందించారు.ఈ స్మార్ట్ గ్లాసెస్ ధరను 499 డాలర్లుగా (భారత కరెన్సీలో సుమారు రూ. 43,500) నిర్ణయించారు. అక్టోబర్ 21 నుంచి అమెరికా, యూకే, కెనడా సహా 17 దేశాల్లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది చివర్లో రెండో దశలో భాగంగా భారత్‌తో పాటు మెక్సికో, బ్రెజిల్, యూఏఈ మార్కెట్లలోనూ వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు మెటా ప్రకటించింది.