|
|
by Suryaa Desk | Fri, Aug 22, 2025, 12:12 PM
TG: 89 క్రిమినల్ కేసులతో దేశంలోనే రేవంత్ రెడ్డి నంబర్ 1గా ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్( ఏడీఆర్) వెల్లడించింది. 30 రోజులు జైల్లో ఉన్న నాయకులను పదవి నుండి తొలగించే కొత్త చట్టం వస్తున్న నేపథ్యంలో క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రుల జాబితా విడుదల చేసింది. దేశంలో 42% సీఎంలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. రెండవ స్థానంలో తమిళనాడు సీఎం స్టాలిన్, మూడవ స్థానంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలిపింది.