|
|
by Suryaa Desk | Fri, Aug 22, 2025, 12:09 PM
నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజిరెడ్డి గోమారం గ్రామంలో పర్యటించి, ఎస్సి, బిసి కాలనీల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ఎస్సి సబ్ ప్లాన్, ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో సుమారు రూ 40 లక్షల వ్యయంతో త్వరలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి అవసరమైన అదనపు ఇళ్లను కూడా మంజూరు చేయించి, గోమారం గ్రామాన్ని మోడల్ గ్రామంగా అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు.