|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 03:28 PM
గణపతి నవరాత్రి ఉత్సవాల కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసులు కొన్ని నిబంధనలు విధించారు. ఇందులో భాగంగా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఉన్న గణపతి నవరాత్రుల ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా policeportal.tspolice.gov.in/index.htm లో పర్మిషన్ కోసం అప్లై చేసుకుని అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేలా గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.