|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 03:24 PM
TG: కాంగ్రెస్ వాళ్లకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో పోటీ లేదని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మనలో మనకే పోటీ నడుస్తోందని, తనకు ఇంఛార్జి మంత్రి బాధ్యతలు ఇచ్చిన తర్వాత అందర్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నారు. మనమంతా కలిసి ఉంటేనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవొచ్చంటూ వెల్లడించారు. అంతర్గత సమస్యలు లేని పార్టీ అంటూ ఏదీ లేదంటూ వ్యాఖ్యానించారు.