|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 03:06 PM
మహారాష్ట్రలోని జల్గావ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పొలంలో పనిచేస్తున్న ఐదుగురు వ్యక్తులు కరెంట్ షాక్‌తో మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉండగా.. ఆరేళ్ల బాలిక, ఎనిమిదేళ్ల బాలుడు, మరో వ్యక్తి ఉన్నారు. అయితే ఈ ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారని స్థానికులు వెల్లడించారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.