|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 10:47 AM
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం గణనీయంగా పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టులోని 26 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 10 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 4.06 లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, 294.55 టీఎంసీల నీరు నిల్వ ఉంది.