|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 03:24 PM
ఒక ఫోటో వేల పదాలకు సమాధానమని.. కొన్ని శతాబ్ధాల పాటు మిగిలిపోయే జ్ణాపకాలను ఫోటో అందిస్తుందని మంత్రి పొంగులేటి అభిప్రాయపడ్డారు. ఒక్కో ఫోటో ఒక్కో భావాన్ని, ఆలోచనను వ్యక్తపరుస్తుందని చెప్పారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తీసిన ఆ ఫోటోలు ఎన్నో అర్ధాలను, ఎన్నో భావోద్వేగాలను కలిగిస్తాయని తెలిపారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా HYD గ్రీన్ పార్క్ హోటల్లో ఏర్పాటు చేసిన ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు