|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 10:39 AM
TG: మెదక్ జిల్లాలలోని ఏడుపాయల వనదుర్గా ఆలయం చుట్టూ వరద ఉధృతి కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా వరదలు రావడంతో ఆరు రోజులుగా ఆలయం జలదిగ్బంధంలో ఉంది. అమ్మవారి గర్భాలయ దర్శనం నిలిపివేసిన ఆలయ పండితులు.. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో SDRF సిబ్బందితో అధికారులు నిరంతర గస్తీ నిర్వహిస్తున్నారు.