|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 02:16 PM
విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై సోమవారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 3 రోజుల వరుస సెలవులు ముగియడంతో సొంతూర్లకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్ బాట పట్టడంతో వాహనాల రద్దీ పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. రద్దీ అధికంగా ఉండటంతో నల్లగొండ నుండి హైదరాబాద్‌కు వెళ్లే కొన్ని నాన్‌స్టాప్ బస్సులు మునుగోడు మీదుగా ట్రావెల్ చేస్తున్నాయి.