|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 10:46 AM
భారీ వర్షాల కారణంగా మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గా భవానీ ఆలయాన్ని మంజీరా నది చుట్టుముట్టింది. వరద ప్రభావంతో ఐదో రోజు కూడా ఏడుపాయల ఆలయాన్ని మూసివేశారు. దీంతో రాజగోపురం వద్దనున్న ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు. ఎగువన సింగూరు ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తడంతో ఆలయం వద్ద మంజీరా నది ఉద్ధృతి పెరిగింది. మంజీరా జలాలు గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి పాదాలను తాకుతున్నాయి.