|
|
by Suryaa Desk | Sat, Aug 02, 2025, 02:16 PM
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఇబ్బందులు పట్టించుకోవడం లేదని మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత విమర్శించారు. శనివారం జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామ శివారులో పొలంలో నాట్లు వేస్తున్న మహిళలతో ముచ్చటించారు. విత్తనాలు ఎరువులు కూడా సరియైన సమయంలో ఇవ్వక రైతులను గోస పెడుతుందని అన్నారు. కేసీఆర్ హయాంలో రైతులను రాజు చేస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కన్నీళ్లు పెట్టిస్తుందన్నారు.