![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 03:33 PM
TG: విద్యా సంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులు అవుతున్నా గురుకుల విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫాం, టై, బెల్ట్, బూట్లు, బ్యాగులు ఇవ్వకపోవడం సిగ్గుచేటని BRS నేత హరీశ్ రావు పేర్కొన్నారు. 'కాంట్రాక్టర్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాల అద్దె బకాయిలు చెల్లించాలి. ఆహార పదార్థాలు, ఇతర సామగ్రి సరఫరా అంతరాయం లేకుండా చూడాలి. యూనిఫామ్, బూట్లు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేయాలి' అని డిమాండ్ చేశారు.