![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 03:35 PM
గణేష్ గడ్డ దేవస్థానం ఎదురుగా కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నందున భక్తులు రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. కావున బ్రిడ్జి కింది నుంచి భక్తులు రావడానికి పోవడానికి అండర్ క్రాస్ లైన్ వేయించగలరని ఎంపీ రఘునందన్ ని దేవస్థానం సభ్యులు కోరారు. ఈ విషయమై ఎంపీ సానుకూలంగా స్పందించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అండర్ పాస్ లైను వేయించడానికి పై అధికారులతో మాట్లాడి ఈ సమస్యను తొందరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.