టీజీఈఏపీసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల
by Suryaa Desk |
Fri, Jun 27, 2025, 03:37 PM
తెలంగాణ ఈఏపీసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ శుక్రవారం విడుదలైంది. మూడు విడతల్లో అధికారులు కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు. జూన్ 28 నుంచి జులై 7 వరకు స్లాట్ బుకింగ్‌కు, జులై 6 నుంచి 10వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. జులై 14, 15 తేదీల్లో తొలి విడత మాక్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుంది. అనంతరం మొదటి విడత సీట్లను కేటాయించనున్నారు. జులై 25 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ చేపట్టనున్నారు.