![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 09:18 PM
పటాన్చెరు : పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి రైతు ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని.. అర్హులైన ప్రతి రైతుకి రైతు భరోసా నిధులు విడుదల చేయడం జరిగిందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రైతులకు రైతు భరోసా నిధులు అందించడంలో కీలక పాత్ర పోషించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు విడుదలైన సందర్భంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రైతులకు నిధులు విడుదల కాకపోవడంతో వెంటనే స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకుని వెళ్లి.. నిధులు విడుదల అయ్యేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. రైతు భరోసాతో పాటు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించేలా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ రైతాంగానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. రైతు భరోసా నిధులు విడుదల చేయడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ రావు, సీనియర్ నాయకులు సంజీవరెడ్డి, శ్రీనివాస్, మల్లేష్ యాదవ్, మతిన్, మల్లేష్ యాదవ్, విఠల్ రెడ్డి, మాధవ రెడ్డి, బిక్షపతి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.