|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 01:05 PM
బాసర పుణ్యక్షేత్రంలో విషాదం నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానం చేసేందుకు వెళ్లి మునిగిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజఈతగాళ్లతో గోదావరిలో గాలింపు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఐదుగురు మరణించారు. మరణించినవారంతా హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ వాసులుగా గుర్తించారు. అందరూ ఒకే కుటుంబానికి చెందివారని పోలీసులు తెలిపారు. నిర్మల్ జిల్లాలోని బాసరలో ఆదివారం తీరని విషాదం నెలకొంది. హైదరాబాద్ నుంచి సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు స్నానం చేసేందుకు గోదావరి నదిలోకి దిగారు. అయితే నీటి లోతు తెలియకపోవడంతో వారు మునిగిపోయారు. అక్కడున్నవాళ్ల సమాచారంతో గజఈతగాళ్లతో పోలీసులు గోదావరిలో రెస్య్కూ ఆపరేషన్ చేపట్టారు. నదిలో నుంచి ఐదుగురు డెడ్ బాడీలను బయటకు తీశారు. మరణించినవారంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. దిల్ సుఖ్ నగర్ నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఐదుగురు యువకులు ఈ విధంగా మరణించడం స్థానికులను కూడా కలచి వేసింది. డెడ్ బాడీలను సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.అనంతరం బంధువులకు డెడ్ బాడీలను అప్పగించారు.