|
|
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 12:38 PM
వేములవాడ పట్టణంలోని బద్దిపోచమ్మ ఆలయానికి మంగళవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ధర్మదర్శనంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. అందర్నీ చల్లంగా చూడు తల్లి అంటూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. సోమవారం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు మంగళవారం బద్ది పోచమ్మ తల్లిని దర్శించుకుని బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని భక్తులు చెబుతున్నారు.