|
|
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 01:48 PM
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు తెలిపారు. బుధవారం ఓదెల మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో రూ. 8 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం నిరుపేదలకు ఇళ్లను మంజూరు చేయడంలో చొరవ చూపుతున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు అందజేసి, కొత్త ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ఇకపై అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటుందని, సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే తమ లక్ష్యమన్నారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.