![]() |
![]() |
by Suryaa Desk | Tue, May 20, 2025, 03:36 PM
తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈరోజు ఖమ్మం, కామారెడ్డి, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైన పనులు తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, రైతులు, పల్లెప్రాంత వాసులు తమ పనులలో తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.