|
|
by Suryaa Desk | Thu, May 15, 2025, 01:55 PM
ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతుల నుంచి తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా కౌన్సిల్ నెంబర్ మేకల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామంలోని ఐకేపి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన, అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల కురిసిన అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయని, అప్పుల పాలై ఉన్న రైతులకు ఇది తీరని నష్టం అని పేర్కొన్నారు. తడిసిన ధాన్యం కారణంగా రైతులు బోసిపోతున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి తడిసిన ధాన్యాన్ని నిషేధాలు లేకుండా పూర్తిగా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తంగడ రాజేశ్వరరావు మరియు ఇతర స్థానిక నేతలు పాల్గొన్నారు. రైతుల పక్షాన ప్రభుత్వం గళం వినిపించాలంటూ వారు డిమాండ్ చేశారు.