|
|
by Suryaa Desk | Thu, May 15, 2025, 11:48 AM
జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద పార్కింగ్‌లో ఉన్న షిఫ్ట్ కారులో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. వివరాల ప్రకారం, పార్కింగ్‌లో నిలిపి ఉన్న కారు నుంచి అకస్మాత్తుగా పొగలు రావడంతో మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ కారు మిడ్జిల్ మండలం మసిగుండ్లపల్లికి చెందిన శివాజీకి సంబంధించినదిగా గుర్తించారు. మంటలకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు, అయితే పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.