|
|
by Suryaa Desk | Thu, May 15, 2025, 11:43 AM
వనపర్తి జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం మరియు హక్కుల సాధన కోసం ఈ నెల 28న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో "జనభేరి" పేరిట భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ విషయాన్ని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ తెలిపారు.
రాచాల యుగంధర్ గౌడ్ మాట్లాడుతూ, గత 15 ఏళ్లుగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నామని, గత ప్రభుత్వ హయాంలో తమపై అనేక అక్రమ కేసులు పెట్టినప్పటికీ, వాటిని ధైర్యంగా ఎదుర్కొని పలు సమస్యలపై అలుపెరగని సమరం కొనసాగించామని వెల్లడించారు. ఈ బహిరంగ సభ ద్వారా జిల్లా ప్రజల సమస్యలను మరింత ఉదృతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.