|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 09:20 PM
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ నాయకురాలు మాధవీలత ప్రకటించారు. పార్టీ అధిష్ఠానం అవకాశం ఇస్తే ఎన్నికల యుద్ధానికి తాను సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆమె, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ, "బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలనల వల్ల తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అధిష్ఠానం పరిశీలిస్తున్న అభ్యర్థుల జాబితాలో నా పేరు కూడా ఉందని తెలిసింది. పార్టీ నాకు అవకాశం కల్పిస్తే జూబ్లీహిల్స్‌లో తప్పకుండా పోటీ చేస్తాను" అని ధీమా వ్యక్తం చేశారు.