|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 03:43 PM
మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్, అధికారులతో కలిసి శుక్రవారం డివిజన్ లో వరద ప్రభావాన్ని పరిశీలించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల చేరుకున్న చెత్తను ముందస్తు చర్యగా తొలగించారు. నాలాలలో పరుపులు, దిండ్లు, చాపలు వేయడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని అధికారులు తెలిపారు. బండ చెరువు నీటిని ముందస్తు సమాచారం లేకుండా విడుదల చేయడంపై శ్రవణ్ అధికారులను నిలదీశారు.