|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 03:18 PM
దసరా సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ బస్సు ఛార్జీలను 50% పెంచుతున్నట్లు ప్రకటించడంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పల్లె వెలుగు సహా అన్ని బస్సుల్లో టికెట్ ధరలు విపరీతంగా పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. అదనపు సర్వీసుల పేరుతో దోపిడీ జరుగుతోందని, ఇది పండుగ సంతోషాన్ని దూరం చేస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరా అని ఆయన ప్రశ్నించారు.