|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 03:17 PM
షాద్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీ పడబోనని, నిధులను సమకూర్చుకునేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నట్లు షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం షాద్‌నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధుల సమీకరణకు ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైన మేరకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలిపారు.