|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 03:16 PM
భారీ వర్షాల కారణంగా శివ్వయిపల్లి రహదారిపై ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోవడంతో ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో, బ్రిడ్జిని పునరుద్ధరించాలని, రాయినిపల్లి ప్రాజెక్టు కాలువలను మరమ్మతులు చేసి సాగునీరు అందించాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేల పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి శుక్రవారం కలెక్టర్ రాహుల్ రాజ్‌కు వినతిపత్రం అందజేశారు.