|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 11:19 AM
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆదర్శ్ నగర్ - బాపూనగర్ లో ఈరోజు ప్రజా సమస్యపై "మన బస్తి బాట" కార్యక్రమం యొక్క 5వ రోజు కార్యక్రమం జరిగింది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మారబోయిన రవి యాదవ్ ప్రాంతంలోని చిన్న చిన్న గల్లీలలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.*ప్రధాన సమస్యలు:- డ్రైనేజీ సమస్య: గత రాత్రి భారీ వర్షం కారణంగా డ్రైనేజీ నీరు రోడ్లపై పూర్తిగా పోగుతుంది, తాగునీటి సరఫరా లోపం, - స్కూల్ విద్యార్థుల కష్టం: పాఠశాలకు వెళ్లే పిల్లలు మురికి నీటిలో నడవడం చాలా బాధాకరం, - విద్యుత్ సమస్య: వర్షం కారణంగా షార్ట్ సర్క్యూట్, ఇళ్లలో కరెంట్ సమస్యలు, - అశుభ్రత: ప్రాంతం అంతటా చెత్త వ్యర్థాలు, దోమలు మరియు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు.* రవి యాదవ్ మాట్లాడుతాడు: *"నేను ఈ రోజు ఆదర్శ్ నగర్లో చూసిన సమస్యలు చాలా బాధాకరమైనవి. ప్రజలు ప్రాథమిక సదుపాయాలు లేకుండా ఎలా జీవిస్తున్నారో చూసి మనసు క్రుంగిపోతుంది. ఈ సమస్యలన్నింటినీ తొరగా పరిష్కరించడానికి నేను నా పూర్తి మద్దతు ఇస్తాను."* *"ప్రజల సమస్యల పరిష్కారం కోసం నేను నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను. ఆదర్శ్ నగర్, బాపు నగర్ ప్రజల అవసరాలను త్వరితగతిన పరిష్కరిస్తాను!"*
ఈ కార్యక్రమం లో వెంకటరెడ్డి, శ్రీకాంత్ యాదవ్, గడ్డ మహేష్, శ్రీశైలం యాదవ్, గడ్డం శ్రీనివాస్, గంగాధర్ గౌడ్, నవీన్ గౌడ్, సతి గావుడ్, సాయి నందన్ ముదిరాజ్, మరోజు పవన్, వడ్డే శ్రీనివాస్, రాజు గౌడ్, బాలరాజు, శంకర్, మున్నా, రాజు గౌడ్, శ్రీకాంత్ రెడ్డి,అరవింద్, నర్సింహా, దివ్య తదితరులు పాలుగోన్నారు.