|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 11:32 AM
తిరుమల : తన జన్మదినం పురస్కరించుకొని కలియుగదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ కు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. తన పుట్టినరోజును పురస్కరించుకొని వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, ఆర్థిక అభివృద్ధి సాధించాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజల అభిమానం, ఆశీర్వాదం ఎల్లప్పుడూ తనపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.