|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 10:56 AM
జడ్చర్లలో, జహీర్ దర్శక, నిర్మాతగా ఎస్ ఆర్ ఎఫ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందించిన 'పడుచు పిల్లో' తెలంగాణ ఫోక్ సాంగ్ ను మాజీ మంత్రి, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సీ లక్ష్మారెడ్డి తన నివాసంలో యూట్యూబ్‌లో విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రామీణ కళాకారులు తెలుగులోకి వస్తున్నారని, వారి కలలకు మంచి ఆదరణ లభిస్తోందని ఆయన అన్నారు. గేయ రచయిత బూర్గుపల్లి కృష్ణ యాదవ్, డైరెక్టర్ జహీర్, డ్యాన్సర్ రాఖీ స్థానికులు కావడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.