|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 10:54 AM
బాచుపల్లి ప్లాట్ల వేలంలో ఒక్క ప్లాటు కూడా అమ్ముడుపోని వైనం. అత్యధికంగా గజం రూ.70,000 నిర్ణయించడంతోనే స్పందించని వినియోగదారులు. హైదరాబాద్–బాచుపల్లిలో తమ సంస్థకు చెందిన 70 ప్లాట్లు వేలం వేయగా, ఒక్కటి కూడా అమ్ముడుపోకపోవడంతో షాకైన హెచ్ఎండీఏ అధికారులు. గజం ధర రూ.70,000 నిర్ణయించడంతోనే ఎవరూ ఆసక్తి చూపలేదని పలువురు సిబ్బంది ఆరోపణలు. మరోవైపు తుర్కయాంజల్ ప్రాంతంలో 12 ప్లాట్లు వేలం వేయగా, కేవలం 2 ప్లాట్లు మాత్రమే అమ్ముడుపోవడంతో తీవ్ర నిరాశలో హెచ్ఎండీఏ. అధిక ధరలే కారణమని కొందరు, ప్రభుత్వ సంస్థలపైన నమ్మకం కోల్పోవడమే కారణమని విమర్శిస్తున్న మరికొందరు విశ్లేషకులు