|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 06:44 PM
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి ఆదేశాల మేరకు, జిహెచ్ఎంసి ఏరియాలోని బస్తీల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి 'బస్తీ బాట' కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు జనరల్ బజార్ సెక్షన్ లోని గ్యాస్ మండి ప్రాంతంలో సెక్షన్ ఏఈ రవికుమార్ ఆధ్వర్యంలో బస్తీ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పరిష్కారం కోసం ప్రతిపాదనలు పంపి, సమస్యలను పరిష్కరిస్తామని ఏఈ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోర్మాన్ మల్లేశం, సబ్ ఇంజనీర్, సిబ్బంది పాల్గొన్నారు.