|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 06:48 PM
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రెడీ అయ్యింది. ఇందులో భాగంగా ఇప్పటికే MPTC, ZPTC, గ్రామ పంచాయతీలు వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు తుది ఓటర్ జాబితాను జిల్లాల వారీగా ఎన్నికల అధికారులు ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రంలో గ్రామీణ జనాభా 1.95 కోట్లు కాగా, గ్రామీణ ఓటర్లు 1,60,03,168 మంది ఉన్నట్లు తేలింది. గ్రామీణ ఓటర్ల జాబితాల్లో సింహభాగం మహిళలు ఉండటం విశేషం. దీంతో స్థానిక ఎన్నికల్లో వీళ్ళ ఓట్లు కీలకం కాబోతున్నాయి.