|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 06:24 PM
నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ, విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు అందించే ఉన్నత విద్యా అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. గురువారం తెలుగు విభాగం, సత్యసాయి సేవా సమితి సంయుక్తంగా "వర్తమానంలో మన నడవడి మన భవిష్యత్ ను ఎలా నిర్ణయిస్తుంది" అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, సత్యసాయి సేవా సంస్థ విద్యార్థులకు అనేక ఉపకార వేతనాలు, విద్యా అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు.