|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 06:19 PM
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. కాసేపటి క్రితమే మొదలైన వాన, నగరం మొత్తం విస్తరించింది. సిటీలో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. పంజాగుట్ట, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, కూకట్ పల్లి, మూసాపేట, చాంద్రాయణ గుట్ట, సైనిక్ పూరి, బండ్లగూడ, ఫలక్ నూమా, పాతబస్తీ, బోరబండ, మెహదీపట్నం ప్రాంతాల్లో భారీ వాన కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి.