|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 10:45 AM
బోడుప్పల్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో మున్సిపల్ కమిషనర్ ప్రోటోకాల్ పాటించడం లేదని, ఎన్నికైన ఎమ్మెల్యేతో పాటు ఇతర పార్టీల నాయకులను ఆహ్వానించకుండా కేవలం అధికార పార్టీ నేతలతోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కమిషనర్ శైలజకు వినతిపత్రం అందజేశారు. ఈ తీరును ఖండించిన నాయకులు, తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.