|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 03:34 PM
సంగారెడ్డి జిల్లాలో బుధవారం శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ, విశ్వకర్మ భగవాన్ సృజనాత్మకతకు ప్రతీక అని కొనియాడారు. ప్రతి నిర్మాణం వెనుక శ్రమజీవి శక్తి ఉందని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. శిల్పులు సమాజ నిర్మాణానికి మూల స్తంభాలని టి.జి.ఐ.ఐ.సి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.