|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 11:56 AM
పేదోడికి సీఎం సహాయనిధి(CMRF) ఆరోగ్య, ఆర్థిక భరోసా కల్పిస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.బుధవారం చిట్కుల్ ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో పటాన్ చెరు నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులు ఇస్నాపూర్ మున్సిపాలిటీ-తిప్పగుడిసే సుజాత (60,000), కరణం మంజుల (60,000/-),తిప్పగుడిసే నవీన్(30,000), చిట్కుల్ పరిధిలోని మన్నే వెంకటేష్ (60,000), బొల్లారం మున్సిపాలిటీ - రెడ్డి లక్ష్మణ్ రావు (60,000), గుమ్మడిదల మున్సిపాలిటీ - తుడుం రాజమ్మ (₹55,000/-) మొత్తం ₹3,25,000/- విలువగల CMRF చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు CMRF ఆర్థిక భరోసా కల్పిస్తుంది అని ఈ పధకం కోసం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు మరియు వారి కుటుంబీకులు, ఇస్నాపూర్ మాజీ సర్పంచ్, ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం, బొల్లారం మాజీ కౌన్సిలర్ సుజాతమహేందర్ రెడ్డి, దానయ్య, ముత్తంగి అశోక్, తుడుం శ్రీనివాస్, గారెల మల్లేష్, మన్నె రఘు, భిక్షపతి రెడ్డి, గోపాల్, గారెల శ్రీనివాస్, దశరథ్, అనిల్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.