|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 11:14 AM
కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన బాధితులు . తమ ఇల్లు కూలిస్తే చస్తామంటూ పెట్రోల్ పోసుకున్న యువకుడు. 3 లక్షలు ఇస్తే మీ ఇంటికి ఏం కాదంటూ అధికార పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారని బాధితుల ఆరోపణ. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా - పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ సర్వే నెం 199 వీకర్ సెక్షన్ కాలనీలో రెవెన్యూ సిబ్బంది అక్రమ నిర్మాణం పేరిట చేపట్టిన పేదల ఇండ్ల కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీసింది.గత 25 ఏండ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని మాకు ఈ చిన్నపాటి రేకుల ఇల్లే జీవనాధారం… ఆటో నడిపించుకుంటూ, కూలి పని చేసుకుని కాలం వెళ్లదీస్తున్నాం. మా ఇంటిని కూల్చొద్దు అంటూ వేడుకున్నారు.స్థానిక అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పరమేశ్, కరీంలు మావద్ద రూ.3 లక్షలు డిమాండ్ చేశారని మాకు అంత స్తొమత లేదని కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదని బాధితులు ఆరోపించారు.డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో మాపై కుట్రపూరీతంగా తప్పుడు సమాచారం ఇచ్చి మేడిపల్లి మండల రెవిన్యూ అధికారులను పిలిపించారు.పేదవారిపైనే మీ ప్రతాపమా అంటూ తమకు న్యాయం చేయాలని బాధితులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.