|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 10:29 AM
నారాయణపేట జిల్లా కేంద్రంలో యూరియా బస్తాలు కాకుండా, వాటిని తీసుకోవడానికి ఇచ్చే టోకెన్ల కోసం రైతులు ఉదయం 4 గంటల నుండి క్యూలో నిలబడుతున్నారు. గత మూడు రోజులుగా షాపులు తెరవకపోవడంతో పాటు, అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులు రైతుల కష్టాలను గమనించాలని వారు కోరుతున్నారు.