|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 11:34 PM
IAS Transfers | తెలంగాణలో పలు ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎన్వీఎస్ రెడ్డికి హెచ్ఆర్ఎం ఎండీగా బాధ్యతలు అప్పగించారు. అదనంగా, ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారుగా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్గా శృతి ఓజాను బదిలీ చేశారు. అలాగే, ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా కృష్ణ ఆదిత్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. హెచ్ఎండీఏ కార్యదర్శిగా కోట శ్రీనివాత్సవకు కూడా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌లుగా ఆర్. ఉపేందర్ రెడ్డి, టీ. వెంకన్నలను నియమించారు. హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిగా ఎం. రాజిరెడ్డి, ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా రాజేశ్వర్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.